యూపీలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి | IAF helicopter crashes in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి

Jul 25 2014 6:23 PM | Updated on Sep 2 2017 10:52 AM

ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి బయలుదేరింది, మృతులు వివరాలు వెంటనే తెలియరాలేదు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. గత మూడేళ్లో 11 వైమానిక దళ హెలికాప్టర్లు కూలిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement