రాజకీయాల్లోకి వస్తా.. | I want to join politics,says Yaduveera Krishnadatta Chamaraja Wadiyar | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి వస్తా..

Sep 4 2015 9:34 AM | Updated on Sep 3 2017 8:44 AM

రాజకీయాల్లోకి వస్తా..

రాజకీయాల్లోకి వస్తా..

తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందని యదువంశ ఉత్తరాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ తెలిపారు.

బెంగళూరు(బనశంకరి) : తనకు రాజకీయాల్లో ప్రవేశించాలని ఉందని యదువంశ ఉత్తరాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ తెలిపారు. మైసూరులోని కళామందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాజీవితంలోకి వచ్చి మరిన్ని ప్రజాసేవకార్యక్రమాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై రాజమాత రాణి ప్రమోదదేవి సూచనలు పాటించనున్నట్లు తెలిపారు.
 
ఈసారి నాడహబ్బ దసరాలో ప్రైవేట్ దర్బార్‌లో తన తండ్రి స్థానంలో నిలుచుని సంప్రదాయబద్ధంగా అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. మైసూరు ప్యాలెస్‌లో దసరా సంప్రదాయాలు గురించి నేర్చుకోవడం చాలాకష్టమని వాటిన్నింటిని నేర్చుకుంటున్నానని తెలిపారు.  ప్రభుత్వం నిర్వహించే దసరాకు తమ ప్యాలెస్‌లో నిర్వహించే దసరాకు చాలా వ్యత్యాసముంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement