మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ భారీ మోసం | Huge cheating to held of giving medical seats | Sakshi
Sakshi News home page

మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ భారీ మోసం

Aug 12 2015 4:26 PM | Updated on Oct 9 2018 7:52 PM

హిమాయత్‌నగర్‌లోని ప్రైమ్‌టెక్ సొల్యూషన్స్ అనే ఓ కన్సల్టెన్సీపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు.

హిమాయత్‌నగర్ (హైదరాబాద్): హిమాయత్‌నగర్‌లోని ప్రైమ్‌టెక్ సొల్యూషన్స్ అనే ఓ కన్సల్టెన్సీపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ సంస్థ మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని, ఎంసెట్‌లో మార్కులు వేయిస్తానని చెప్పి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మెడికల్ సీటు ఇప్పిస్తానని తన దగ్గర ప్రైమ్‌టెక్ సొల్యూషన్స్ అధినేత సతీష్‌పాల్‌యాడ్ రూ.10 లక్షలు తీసుకున్నారంటూ గోపీకృష్ణ అనే బాధితుడు నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కన్సల్టెన్సీ కార్యాలయంపై దాడులు నిర్వహించి విచారణ నిర్వహించారు. కాగా, బాధితుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్ల నుంచి ఈ సంస్థ ఇక్కడ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement