లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్ | Himachal judge suspended for harassing woman colleague | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్

Jul 2 2015 11:33 AM | Updated on Sep 26 2018 6:09 PM

లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్ - Sakshi

లైంగిక వేధింపులు.. జడ్జి సస్పెన్షన్

మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో న్యాయమూర్తిని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది.

సిమ్లా: మహిళా జడ్జిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో న్యాయమూర్తిని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఈ కేసులో దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. సదరు జడ్జి జూన్ 8న మనాలిలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మహిళా జడ్జి ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఈ చర్య తీసుకుంది.

మాదకద్రవ్యాల నేరాలపై గత నెలలో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సుకు హాజరైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కంపెనీ ఇవ్వాలని బలవంతం చేయడమే కాకుండా... టీజ్ చేశారని, వేధించారని హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దీనిపై విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement