ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్ | highest temperature at Bhadrachalam | Sakshi
Sakshi News home page

ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్

Apr 11 2017 8:50 PM | Updated on Sep 5 2017 8:32 AM

ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్

ఠారెత్తించిన భానుడు.. రికార్డు టెంపరేచర్

రాష్ట్రంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత కావటం గమనార్హం.

- భద్రాద్రిలో ఎండ మండింది!
హైదరాబాద్‌: తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం భద్రాచలం పట్టణంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం కావటం గమనార్హం. యానంబైలు గ్రామంలోనూ 44.1 డిగ్రీలు ఉంది. ఈ రెండూ భదాద్రి కొత్తగూడెంలోనివే.

దీంతోపాటు వైరాలో 44, మహబూబ్‌నగర్‌ 42.6, ఖమ్మంలో 42.2, ఆదిలాబాద్‌ 41.3, హైదరాబాద్‌లో 40 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. సాధారణ స్థాయి కంటే రెండు లేదా మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement