రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | Heavy rains in coastal andhra pradesh, says visakhapatnam meteorological department | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Sep 11 2015 9:52 AM | Updated on Sep 3 2017 9:12 AM

రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

రేపటి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది.

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం బలపడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. అది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోస్తాంధ్రలో చెదురుమదురుగా... రేపటి నుంచి మాత్రం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
 

Advertisement
 
Advertisement
Advertisement