బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్! | Have cake and eat it': Brexit secret notes cause stir in UK, govt plays down leak | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్!

Nov 29 2016 7:26 PM | Updated on Sep 4 2017 9:27 PM

బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్!

బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ లీక్!

బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ బయటపడ్డాయి. బ్రెగ్జిట్ మీటింగ్ అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేత సహాయకుడు తీసుకెళ్తున్న నోట్స్ వివరాలను డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) దగ్గర ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు.

బ్రెగ్జిట్ సీక్రెట్ నోట్స్ బయటపడ్డాయి. బ్రెగ్జిట్ మీటింగ్ అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేత సహాయకుడు తీసుకెళ్తున్న నోట్స్ వివరాలను డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) దగ్గర ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ సీక్రెట్ మెమో బయటపడటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు చెలరేగాయి. అయితే అది బ్రెగ్జిట్ వివరాలు కావని, ఆయన వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. వ్రాతపూర్వకంగా రాసుకున్న ఈ పత్రాలను కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ మార్క్ ఫీల్డ్ సహాయకుడు పట్టుకెళ్తుండగా బయటపడ్డాయి. స్టీవ్ బ్యాక్ అనే ఫోటోగ్రాఫర్ లాంగ్ లెన్స్ కెమెరాలో ఈ నోట్స్ను బంధించాడని డౌన్ స్ట్రీట్ వెల్లడించింది. అయితే ఈ నోట్స్ ప్రభుత్వ అధికారులకు లేదా ఏ స్పెషల్ అడ్వయిజరీకి సంబంధించింది కాదని, వ్యక్తిగత నోట్స్ మాత్రమేనని  డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నోట్స్లో యూరోపియన్ యూనియన్తో చర్చించబోయే అంశాల్లో వచ్చే అనేక సమస్యలు ఉన్నాయి.
 
యూరోపియన్ యూనియన్ సింగిల్ మార్కెట్గా ఉండే అవకాశాన్ని ఆఫర్ చేయబోవనే అంశం కూడా బయటపడింది. వాణిజ్య పరిమితులు లేని సింగిల్ మార్కెట్ నుంచి యూకే వైదొలిగితే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశంలో మళ్లీ కొత్తగా వాణిజ్య ఒప్పందాలను బ్రిటన్ కుదుర్చుకోవాల్సి వస్తోందని ముందు నుంచి వాదన వినిపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రక్రియ వివరాలను ప్రకటించడానికి మొదటి నుంచి బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తిరస్కరిస్తూ వస్తున్నారు. బ్రెగ్జిట్ అనంతరం యూరోపియన్ యూనియన్తో ఎలాంటి ఒప్పందం చేసుకోబోతున్నారో థెరిస్సా రివీల్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఒప్పందం వివరాలు లీక్ అయితే, యూకే చర్చలు బలహీనమయ్యే అవకాశాలున్నాయని ఆమె చెబుతూ వచ్చారు. కానీ కన్జర్వేటివ్ పార్టీ సహాయకుడు చేతిలోని నోట్స్ను ఓ ఫోటోగ్రాఫర్ తీసి, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది మార్చి నుంచి అధికారిక డైవర్స్ ప్రక్రియ ప్రారంభం చేయాలని థెరిస్సా ప్లాన్ చేస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement