చైనా బరితెగింపు నిజమే! | Harish Rawat confirms Chinese incursion in Uttarakhand Chamoli district | Sakshi
Sakshi News home page

చైనా బరితెగింపు నిజమే!

Jul 27 2016 1:45 PM | Updated on Aug 13 2018 3:34 PM

చైనా బరితెగింపు నిజమే! - Sakshi

చైనా బరితెగింపు నిజమే!

భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి.

భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోకి చైనా బలగాలు చొరబడిన విషయం నిజమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో ఉన్న చమోలి జిల్లాలోని బరాహోటి ప్రాంతంలోకి గత నెల 13న డ్రాగన్ బలగాలు చొచ్చుకొని వచ్చాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

చైనా బలగాలు మన భూభాగంలోకి వచ్చినప్పటికీ అక్కడ కీలకమైన కాలువ దగ్గరికి వెళ్లలేదని, ఇది భారత్‌కు సంబంధించినంతవరకు మంచి విషయమని సీఎం రావత్ చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంతో చైనాకు 350 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. గతంలోనూ చైనా పలుమార్లు ఉత్తరాఖండ్‌లోకి చొరబడి.. ‘చైనా’ అనే బోర్డులు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement