ఆంధ్రా, మహారాష్ట్రలో రెండు మెగా ఫుడ్ ప్రాజెక్టులు | Sakshi
Sakshi News home page

ఆంధ్రా,మహారాష్ట్రలో రెండు మెగా ఫుడ్ ప్రాజెక్టులు

Published Thu, Aug 4 2016 8:39 PM

Govt lines up Rs 324 cr to set up food parks in Andhra, Maha

న్యూడిల్లీ: ప్రతిష్టాత్మక   సాగర మాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లో రెండు మెగా ఫుడ్ పార్క్ లు   నెలకొల్పనున్నట్టు కేంద్ర  ప్రభుత్వం  గురువారం ప్రకటించింది. సుమారు  రూ 324 కోట్ల వ్యయంతో రెండు మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు  వెల్లడించింది.  సాగర మాల ప్రణాళికలో భాగంగా, రెండు మెగా ఫుడ్ పార్కులు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు  షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో   ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ, దక్షిణ మహారాష్ట్ర  ప్రాంతాలను ఈ ప్రాజెక్టుల కోసం ఎంచుకున్నట్టుచెప్పారు. కోస్టల్ ఎకనమిక్ జోన్ లలో ఈ ప్రాజెక్టులను వ్యూహాత్మకంగా  అమలుచేయనున్నట్టు  పేర్కొంది.  దీనికి  ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ 184.88 కోట్ల అంచనా వేసింది. మహారాష్ట్ర కోస్టల్ జోన్ లో ప్రాజెక్టుకు 139.33 కోట్లు అంచనా వేశామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి  పూర్తి చేయాలని భావిస్ఓతంది.  
 
భారతదేశం లో ప్రాసెస్డ్ ఫుడ్ పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ ఉందనీ,  ఆహార ప్రాసెసింగ్ రంగంలో  పోటీకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.   ఈనేపథ్యంలో లాజిస్టిక్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల పరంగా సమర్థవంతంగా ఉండాలన్నారు.  పారిశ్రామిక సంస్థల సమూహాలు, సీఈజెడ్ లకు చెందిన  రకరకాల ఓడరేవులకు  లాజిస్టిక్ ఖర్చులు తగ్గింపు భరోసా, మౌలిక సౌకర్యాలు,  కనెక్టివిటీ  సదుపాయాలు అందించడానికి ఆ ప్రకటన తెలియజేసింది. 
 

Advertisement
Advertisement