అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది! | girl miraculously escapes from a running train | Sakshi
Sakshi News home page

అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!

Feb 23 2017 6:55 PM | Updated on Sep 5 2017 4:26 AM

అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!

అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!

అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు.

అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్‌లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. దిక్కుతోచని ఆ బాలిక ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయింది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు షాకయ్యారు.

ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్‌ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement