‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి’ | Get three Pakistani heads for each Indian soldier’s death: Captain Amarinder Singh | Sakshi
Sakshi News home page

‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి’

May 5 2017 2:13 PM | Updated on Sep 5 2017 10:28 AM

‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి’

‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి’

భారతీయ సైనికులను క్రూరంగా హత్య చేసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు.

న్యూఢిల్లీ: భారతీయ సైనికులను క్రూరంగా హత్య చేసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఒక్కో భారతీయ సైనికుడి తలకు ముగ్గురు పాకిస్తానీయుల తలలు నరకాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన సైనికులను కిరాతకంగా హత్య చేయడాన్ని మాజీ సైనికుడిగా జీర్ణించుకోలేకపోతున్నాను. మన సైనికులను ఏవిధంగా చంపారో అదేవిధంగా పాక్‌ జవాన్లను అంతమొందించాల’ని పేర్కొన్నారు. సరిహద్దులో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆమోదయోగ్యం కాదన్నారు. పొరుగుదేశం దుశ్చర్యలను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోరాదని సూచించారు.

మే 1న భారత భూభాగంలోకి చొరబడి గస్తీ కాస్తోన్న ఇద్దరు జవాన్లను పాక్‌ సైన్యం అతి కిరాతకంగా చంపేసింది. దాయాది దేశం దారుణకృత్యంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మన సైనికుడిని ఒక్కరిని చంపితే వంద మంది పాకిస్తాన్‌ జవాన్ల తలలు తీయాలని యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నారు. ‘పాకిస్తాన్‌లోకి వెళ్లి వాళ్లను ముక్కలు ముక్కలు చేయండి. శివసేన ప్రధానికి మద్దతుగా ఉంటుంద’ని శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement