అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా | Genelia D'Souza wants beauty treatment | Sakshi
Sakshi News home page

అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా

Oct 3 2015 1:33 PM | Updated on Sep 3 2017 10:23 AM

అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా

అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా

మనిషికి అందం చాలా ముఖ్యమైన ఈ రోజుల్లో నటి జెనీలియా అందం ఆవిరై పోయిందట.

ముంబై: మనిషికి అందం చాలా ముఖ్యమైన ఈ రోజుల్లో నటి జెనీలియా అందం ఆవిరై పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఒకప్పటి దక్షిణాది కలల రాణి ఈ అమ్మడు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందారు. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఒక బిడ్డకు తల్లి కూడా అయిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాన్ని బలపరచేలా ఇప్పుడీ ముద్దుగుమ్మ అందం పెంచుకునే అంశంపై శ్రద్ధ పెట్టారు.
 
అందుకోసం కొత్త ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని జెనీలియా తెలుపుతూ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తన శరీర చాయ బాగా నల్లబడిపోయిందన్నారు. ముఖమంతా ప్యాచ్ ప్యాచ్‌గా మారిపోయిందన్నారు. నిజం చెప్పాలంటే తన ముఖాన్ని తానే అద్దంలో చూసుకోవడం మానేశానన్నారు. అంతేకాదు తాను వయసుకు మించి కనిపించడంతో ఆలోచించి మళ్లీ యవ్వనంగా కనిపించడానికి ఆధునిక ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు జెనీలియా.

Advertisement
 
Advertisement
Advertisement