జీఎంఆర్ రైట్స్‌ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ నిధుల సేకరణ | fund raising of promoting company for GMR rights issue | Sakshi
Sakshi News home page

జీఎంఆర్ రైట్స్‌ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ నిధుల సేకరణ

Published Tue, Mar 24 2015 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

జీఎంఆర్ రైట్స్‌ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ నిధుల సేకరణ

జీఎంఆర్ రైట్స్‌ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ నిధుల సేకరణ

జీఎంఆర్ ఇన్‌ఫ్రా రైట్స్ ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ జీఎంఆర్ హోల్డింగ్స్ రూ. 1,250 కోట్ల నిధులను సమీకరించింది.

హైదారాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రా రైట్స్ ఇష్యూ కోసం ప్రమోటింగ్ కంపెనీ జీఎంఆర్ హోల్డింగ్స్ రూ. 1,250 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని సమకూర్చడానికి కేకేఆర్ క్యాపిటల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మొత్తంలో ఇప్పటికే రూ. 1,130 కోట్లను తీసుకున్నట్లు  తెలియచేసింది.

ఈ నిధుల్ని జీఎంఆర్ ఇన్‌ఫ్రా రైట్స్ ఇష్యూ కోసం వినియోగించనున్నట్లు  పేర్కొంది. ఈ నెల 24న ప్రారంభమయ్యే రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించాలని జీఎంఆర్ ఇన్‌ఫ్రా నిర్ణయించింది. ప్రతీ 14 షేర్లకు మూడు షేర్లను కేటాయిస్తారు.ఈ ఇష్యూ ద్వారా సమీకరించే మొత్తంలో సుమారు 90 శాతం నిధులను జీఎంఆర్ హోల్డింగ్ రుణం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement