ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ నెల 11 నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించింది.
అయితే చాలా మంది విద్యార్థులు తమ ఫొటోలు, సంతకాలు, ఇతర సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయని కారణంగా దానిని ఈనెల 15కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది విద్యార్థులు వివరాలు అప్‌లోడ్ చేయని కారణంగా ఈనెల 18కి వాయిదా వేసినట్లు పేర్కొంది. 18 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది.