ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు! | Fresh sexual assault complaints against Asaram Bapu, son | Sakshi
Sakshi News home page

ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!

Oct 6 2013 12:17 PM | Updated on Jul 23 2018 9:13 PM

ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు! - Sakshi

ఆశారాంతోపాటు కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!

వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయిపై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అశారాం బాపును రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో అరెస్ట్ చేసిన జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. 
 
ఇద్దరు యువతుల ఫిర్యాదు మేరకు అశారాం,నారాయణ సాయిలపై కేసు నమోదు చేశామని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానా తెలిపారు. బాధితురాల్లిద్దరూ కూడా అక్కాచెల్లెల్లని పోలీసులు తెలిపారు. నారాయణ సాయి పై సూరత్ లోని జహంగీర్ పూరాలో, ఆహ్మదాబాద్ లో అశారాంపై కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నారాయణ్ స్వామిని పోలీసులు త్వరలో విచారించనున్నారు. 2001 నుంచి 2006 మధ్య కాలంలో తమపై లైంగిక దాడులు చేశారని ఫిర్యాదులో తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement