ఉద్యోగులను పెంచుతున్న ఫేస్‌బుక్‌ | Facebook to add 500 jobs in London | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను పెంచుతున్న ఫేస్‌బుక్‌

Nov 21 2016 6:56 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఉద్యోగులను పెంచుతున్న ఫేస్‌బుక్‌ - Sakshi

ఉద్యోగులను పెంచుతున్న ఫేస్‌బుక్‌

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ యాజమాన్యం బ్రిటన్‌లో సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది.

లండన్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ యాజమాన్యం బ్రిటన్‌లో సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తోంది. లండన్‌లో కొత్తగా హెడ్‌ ఆఫీసును ప్రారంభించబోతోంది. అదనంగా మరో 500 మంది ఉద్యోగులను నియమించనుంది. ఫేస్‌బుక్‌ యూరప్‌ చీఫ్‌ నికోలా మెండెల్సోన్‌ ఈ విషయం చెప్పారు.

‘2007లో లండన్‌లో అందుబాటులో ఉన్న సిబ్బందితో కార్యకలాపాలను ప్రారంభించాం. రానురాను ఉద్యోగులను పెంచుతూ సేవలను విస్తృతం చేశాం. వచ్చే ఏడాది చివరి నాటికి కొత్తగా హెడ్‌ క్వార్టర్స్‌ను ప్రారంభిస్తాం. ఉద్యోగులను పెంచుతాం’ అని  మెండెల్సోన్‌ చెప్పారు. యూరప్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగాలంటూ ఆ దేశ ప్రజలు (బ్రెగ్జిట్‌) తీర్పుచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు, ఇతర సంస్థలు కొత్తగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ కు బ్రిటన్‌ ముఖ్యమైన దేశమని మెండెల్సోన్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement