ఫేస్ బుక్కే టాప్! | Facebook the leader of social media, says Survey | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్కే టాప్!

Jan 11 2015 3:49 PM | Updated on Oct 22 2018 6:02 PM

ఫేస్ బుక్కే టాప్! - Sakshi

ఫేస్ బుక్కే టాప్!

సామాజిక మాధ్యమంలో అగ్రస్థానం ఫేస్ బుక్ దేనని తాజా సర్వేలో వెల్లడైంది.

వాషింగ్టన్: సామాజిక మాధ్యమంలో అగ్రస్థానం ఫేస్ బుక్ దేనని తాజా సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫేస్ బుక్ చూడడానికే మక్కువ చూపుతున్నారని తేలింది. ఫేస్ బుక్ కు ఆదరణ నానాటికీ పెరుగుతోందని అమెరికాకు చెందిన పీ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2014 సంవత్సరానికి గానూ 1,597 ఇంటర్నెట్ వినియోగదారులతో ఈ సర్వే నిర్వహించింది.

అమెరికా పెద్దల్లో 71 శాతం మంది ఫేస్బుక్ చూడడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2013లో ఇది 63 శాతంగా ఉందని ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 45 శాతం మంది రోజులో పలుమార్లు ఫేస్ బుక్ చూస్తున్నట్టు కూడా సర్వే తేటతెల్లం చేసింది. ఇక ట్విటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement