అంబానీ పంచుకున్న సీక్రెట్స్ ఇవే! | Entrepreneurs, take heed! Here are Mukesh Ambani's 5 career lessons | Sakshi
Sakshi News home page

అంబానీ పంచుకున్న సీక్రెట్స్ ఇవే!

Published Fri, Feb 24 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

అంబానీ పంచుకున్న సీక్రెట్స్ ఇవే!

అంబానీ పంచుకున్న సీక్రెట్స్ ఇవే!

దేశంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్కు అధిపతి ముఖేష్ అంబానీ ఎప్పుడైనా తన ట్రేడ్ సీక్రెట్స్ ప్రజలతో పంచుకున్నారా? అంటే అది చాలా అరుదు.

దేశంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అధిపతి ముఖేష్ అంబానీ ఎప్పుడైనా తన ట్రేడ్ సీక్రెట్స్ ను చాలా అరుదుగా పంచుకుంటుంటారు.. కానీ ప్రతిఒక్కరూ ఆ సీక్రెట్స్ తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపుతుంటారు. గతవారం ముంబాయిలో జరిగిన నాస్కామ్ ఫౌండేషన్ యాన్యువల్ లీడర్షిప్ సమిట్లో ముఖేష్ అంబానీ తన ట్రేడ్ సీక్రెట్స్ పంచుకున్నారు. యువ పారిశ్రామికవేత్తలకు సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత ముఖేష్ అంబానీకి అప్పజెప్పడంతో, సలహాలు ఇవ్వడం కంటే తను నేర్చుకున్న పాఠాలను షేర్ చేసుకోవడం మంచిదని, ముఖేష్ అంబానీ తన ట్రేడ్ సీక్రెట్స్ కొన్నింటిన్నీ యువ పారిశ్రామికవేత్తలతో పంచుకున్నారు.   
 
  • అంబానీ తొలి పాఠం తన తండ్రి, రిలయన్స్ గ్రూప్ ఫౌండర్ ధీరుభాయి అంబానీ దగ్గర్నుంచే నేర్చుకున్నారట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత, నా జాబేమిటి? నేను ఏం చేయాలి? అని తండ్రిని అడిగారట. జాబ్, దాన్ని బాధ్యతలు తెలుసుకోవాలనుకుంటే, మేనేజర్ అవుతారు. కానీ పారిశ్రామికవేత్త అవ్వాలనుకుంటే, ఏం చేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకోవాలి. నేను ఏం చెప్పను, ఏం కావాలనుకుంటున్నావో నీవే నిర్ణయించుకో అని తేల్చిచెప్పేశారట. పరిష్కరించాలనుకుంటున్న సమస్యను కనుగోవడమే తర్వాతి ప్రధానమైన అంశమని ముఖేష్ అంబానీ యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఈ సమస్యను పరిష్కరించడం సమాజానికి ఎంతో ఉపయోగపడాలన్నారు. తర్వాతనే ఫైనాన్సియల్ రిటర్న్లపై శ్రద్ధ తీసుకోవాలట. ఒకవేళ కేవలం రిటర్న్స్పై ఫోకస్ చేస్తే, వారు ఎప్పటికీ గ్రేట్ కాలేరని చెప్పారు. 
  • విజయానికి ముందు చాలా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. వాటిని స్వాగతించాలి. కానీ ఢీలా పడిపోకూడదు. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలి అంటూ తన ఫెయిల్యూర్స్ ను, దాని తర్వాత వచ్చిన మంచి ఫలితాలను గుర్తుచేసుకున్నారట. తాను కూడా సక్సెస్ అవడానికి ముందు చాలా ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. 
  • ఫైనల్ గా పాజిటివ్ గా ఉండటం చాలా ముఖ్యమని యువ పారిశ్రామిక వేత్తలో ధైర్యాన్ని నింపారు. పారిశ్రామిక రంగంలోకి అడుగుపెడుతున్న వారికి చాలా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. చాలామంది తమ ధైర్యాన్ని కోల్పోయి, ఢీలా పడిపోతుంటారు. వారందరికీ ముఖేష్ అంబానీ తన అనుభవ పాఠాలతో కొత్త ఉత్సాహానిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement