భారతదేశ రవాణా వ్వవస్థ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు.
	న్యూఢిల్లీ: భారతదేశ రవాణా వ్వవస్థ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని నీతి  ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్  పేర్కొన్నారు.  ప్రతి అయిదు సంవత్సరాలకు  బ్యాటరీల ఖర్చు  దాదాపు సగం తగ్గుతోందని దీంతో రాబోయే  4-5 సంవత్సరాలలో, ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోలు లేదా డీజిల్ వాహనాల కంటే చాలా చవగ్గా లభిస్తాయని చెప్పారు. అలాగే   నిర్వహరణ ఖర్చు కేవలం 20 శాతం మాత్రమేనని చెప్పారు.
	 
	నీతిఆయోగ్,  రాక్  మౌంటైన్ ఇన్సిస్టిట్యూట్  నిర్వహించిన విడుదల చేసిన ఒక ఉమ్మడి నివేదిక ను బుధవారం  వెల్లడించింది. 2030 నాటికి భారతదేశం కోసం కార్బన్ ఉద్గారాలను 1 గిగాటోన్ (జిటి) గా తగ్గనుందనీ,   డీజిల్, పెట్రోల్  ఖర్చుల్లో 60 బిలియన్ డాలర్లను ఆదా చేయగలమని  నివేదించింది.  అయితే ప్రయివేట వాహనాలయాజమాన్యం ద్వారా దేశం సవాళ్లు ఎదుర్కోనుందని తెలిపింది.
	
	ఈ సందర‍్భంగా కాంత్ మాట్లాడుతూ  ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని  ఆయన మరో ఉద్ఘాటించారు.  రాబోయే దశాబ్దకాలంలో ఇవి భారీ ఎత్తున మార్కెట్‌లోకి రానున్నాయన్నారు.   అయిదే  ఈ  ప్రక్రియలో ఆలస్యమైతే..    చమురుకు బదులుగా బ్యాటరీలను దిగుమతి  చేసుకోక తప్పని  పరిస్థితి వస్తుందని..ఇది పెద సవాలని తెలిపారు. దీంతో మార్కెట్లో వెనుకబడిపోతామని  హెచ్చరించారు. అందుకే  ఈ వాహనాల తయారీలో ముందుండాలన్నారు. పెద్ద స్థాయిలో గిరాకీని పెంచడం ముఖ్యమనీ,  ప్రభుత్వ వాహనాలపై, ప్రజా వాహనాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం దానిని నడపడం చాలా ముఖ్యమని కాంత్ అన్నారు.
	
	ఈ నివేదిక ప్రకారం, వార్షిక డీజిల్ , పెట్రోల్ వినియోగం 2030 నాటికి 156 మిలియన్ టన్నుల దాకా తగ్గనుంది. తద్వారా సంవత్సరానికి 3.9 లక్షల కోట్ల రూపాయల ($ 60 బిలియన్) ఆదాయాన్ని  పొదుపు చేయగలుగుతుంది. పాసెంజర్ మొబిలిటీ సంబంధిత  డిమాండ్64 శాతం తగ‍్గడంతోపాటు, 2030 నాటికి 37శాతం కార్బన్ ఉద్గారాలను నిరోధించకలుగుతుందని నివేదిక అంచనా వేసింది. '2030 నాటికి వార్షిక డీజిల్, పెట్రోల్ తగ్గింపు 156 మిలియన్ టన్నుల చమురుతో సమానమవుతుందని  నివేదించింది.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
