ఢిల్లీ సహా 10 రాజధాని నగరాలకు భూకంప ముప్పు | earthquake threat to delhi and 10 states capitals | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సహా 10 రాజధాని నగరాలకు భూకంప ముప్పు

Jul 30 2017 6:27 PM | Updated on Sep 5 2017 5:13 PM

ఢిల్లీ సహా 10 రాష్ట్రాల రాజధానులు భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం ఓ నివేదిక వెల్లడించింది.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా 10 రాష్ట్రాల రాజధానులు భూకంప ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం ఓ నివేదిక వెల్లడించింది. హిమాలయ పర్వత పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలకు భూకంప ముప్పు ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పట్నా, శ్రీనగర్‌, కోహిమ, పుదుచ్చెరి, గువాహటి, గ్యాంగ్‌టక్‌, షిమ్లా, డెహ్రాడూన్‌, ఇంఫాల్‌, చండిగఢ్‌ నగరాలు భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న జోన్‌ 4, 5 లో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ముప్పు పొంచి ఉన్న ఒక్కో నగరంలో ప్రస్తుతం మూడు కోట్లకు పైగా జనాభ నివసిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement