ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి జెలెనా రిస్టిక్తో జొకోవిచ్కు నిశ్చితార్థం జరగనుంది.
ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు, ప్రేయసి జెలెనా రిస్టిక్తో జొకోవిచ్కు నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని అతనే ట్విట్టర్లో వెల్లడించాడు. రిస్టిక్లో నొవార్ ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు.
రిస్టిక్ను ముద్దాడుతున్న ఫొటోను జొకో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన ప్రేయసి భార్య కాబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వారికి ధన్యవాదాలు చెప్పాడు. కాగా జొకోవిచ్ వెన్నంటే ఉండే రిస్టిక్ అతని మ్యాచ్ల సందర్భంగా స్టేడియాల్లో దర్శనమిస్తుంటుంది. అలాగే ఛారిటీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.