డెత్‌ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి | Divyanka puts out a tweet to stop her death rumours | Sakshi
Sakshi News home page

డెత్‌ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి

Sep 2 2017 6:57 PM | Updated on Sep 17 2017 6:18 PM

డెత్‌ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి

డెత్‌ రూమర్స్‌పై స్పందించిన టీవీ నటి

తాను చనిపోయినట్టు సోషల్‌ మీడియాలో వదంతులు చెలరేగడంతో ప్రముఖ టీవీ నటి స్పందించింది.

ముంబై: తాను చనిపోయినట్టు సోషల్‌ మీడియాలో వదంతులు చెలరేగడంతో ప్రముఖ టీవీ నటి దివ్యాంక త్రిపాఠి స్పందించారు. తాను చనిపోలేదంటూ ట్వీట్‌ చేసి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. 'నేను 'రిప్‌మోడ్‌' (రెస్ట్‌ ఇన్ పీస్‌ మోడ్‌.. ఆత్మకు శాంతి పొందే స్థితి)లో ఉన్నట్టు వదంతులను ప్రచారం చేస్తున్నారు. నేను బతికే ఉన్నాను. దయ చేసి ఇలాంటి వదంతులతో నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించకండి' అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్‌ అయ్యారు. ఆమె తొలి సీరియల్‌ 'మే తేరి దుల్హాన్‌' హిట్‌ కావడం ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. అనంతరం డ్యాన్స్‌ షో 'నాచ్‌ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచారు. గత ఏడాది టీవీ సహనటుడు వివేక్‌ దహియా పెళ్లాడిన ఆమె.. త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement