5,500 మంది మహిళలకు టాటా బంపర్ ఆఫర్ | Diversity drive: Tata Steel to induct 5,500 women by 2020 | Sakshi
Sakshi News home page

5,500 మంది మహిళలకు టాటా బంపర్ ఆఫర్

Sep 16 2016 10:15 AM | Updated on Sep 4 2017 1:45 PM

5,500 మంది మహిళలకు టాటా బంపర్ ఆఫర్

5,500 మంది మహిళలకు టాటా బంపర్ ఆఫర్

మహిళల పట్ల ఎల్లప్పుడూ ఉదారత భావం కలిగి ఉండే టాటా స్టీల్, మరో కీలక నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ : మహిళల పట్ల ఎల్లప్పుడూ ఉదారత భావం కలిగి ఉండే టాటా స్టీల్, మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ తయారీసంస్థగా పేరుగాంచిన ఈ సంస్థ, 2020 వరకు 5,500 ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 2,000 మంది మహిళా ఉద్యోగులున్నారు. అంటే 35వేల మంది మొత్తం ఉద్యోగులుల్లో వీరు 6 శాతం కంటే తక్కువ. మహిళా ఉద్యోగులను మరింత పెంచడానికి కంపెనీ 5,500 మందిని రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం కంపెనీలో లింగ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తుందని టాటా సంస్థ భావిస్తోంది. 

అదేవిధంగా అంగవికలాంగులను ఉద్యోగులుగా మరింత మందిని చేర్చుకోవడానికి కంపెనీ కృషిచేస్తోంది. ప్రతేడాది 100 మంది అంగవికలాంగులను ఉద్యోగులుగా చేర్చుకోవాలని టాటా స్టీల్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం 106 మంది అంగవికలాంగులు టాటాస్టీల్లో ఉద్యోగులుగా ఉన్నారు. కంపెనీ రిక్రూట్ చేసుకునే 5,500 మంది మహిళా ఉద్యోగుల్లో 1,400 మందిని మేనేజర్ స్థానాల్లో నియమించుకోనుంది. ప్రస్తుతం 660 మంది మహిళలు టాటా స్టీల్ కంపెనీలో మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా మహిళా ఉద్యోగుల నియామకం ఎక్కువగా పురుషులు ఉద్యోగులుగా వ్యవహరిస్తున్న స్థానాల్లోనే భర్తిచేయనున్నట్టు టాటాస్టీల్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ ఆత్రేయి సర్కార్ తెలిపారు. కొన్ని ఉద్యోగాలను మహిళల కోసం ప్రత్యేకంగా సృష్టించనున్నట్టు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement