ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు | Demonetisation 'great move' for India in longer term, says Tim Cook | Sakshi
Sakshi News home page

ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు

Feb 1 2017 10:45 AM | Updated on Aug 20 2018 2:58 PM

ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు - Sakshi

ఇండియా గ్రేట్: ఆపిల్ సీఈవో ప్రశంసలు

పెట్టుబడులకు భారత్ గొప్ప ప్రదేశమ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రశంసించారు.

న్యూయార్క్: భారత్ లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని అమెరికా టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ భావిస్తోంది. చాలా విషయాల్లో ఇండియాతో చర్చలు జరుపుతున్నామని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రిటైల్ స్టోర్లసహా పలు అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘భారత్ లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులకు భారత్ గొప్ప ప్రదేశమ’ని కుక్ పేర్కొన్నారు.

ఇండియాలో పాత పెద్ద నోట్ల రద్దును ఆయన సమర్థించారు. డీమోనిటైజేషన్ గొప్ప ముందుడుగు అని వర్ణించారు. డీమోనిటైజేషన్ తో దీర్ఘకాలంలో లాభాలు కలుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘డీమోనిటైజేషన్ లో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ గత క్వార్టర్ లో తమ సంస్థ మెరుగైన ఆదాయ ఫలితాలు సాధించింది. నోట్ల రద్దు గొప్ప ముందడుగు. దీనితో మున్ముందు మరింత మేలు జరుగుతుంద’ని అన్నారు. భారత్ లో తమ కంపెనీ పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement