కోడలిపై ఏసీపీ అత్యాచారం | Delhi Police official booked for raping daughter-in-law | Sakshi
Sakshi News home page

కోడలిపై ఏసీపీ అత్యాచారం

Jan 28 2015 8:34 AM | Updated on Jul 28 2018 8:51 PM

కోడలిపై ఏసీపీ అత్యాచారం - Sakshi

కోడలిపై ఏసీపీ అత్యాచారం

కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.

న్యూఢిల్లీ: కోడలిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై కేసు నమోదు చేసినట్లు దక్షిణ ఢిల్లీలోని వసంతకుంజ్ పోలీసులు మంగళవారం వెల్లడించారు.  అయితే సదరు  ఉన్నతాధికారి పేరు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు ఉత్తర ఢిల్లీలోని కీలక ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 


కాగా గత ఏడాది మేలో మామ ఏసీపీ బెదిరించి తనపై అత్యాచారం చేశారని... ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదించారని... దాంతో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైయానని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీపీని ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement