సమరానికి సై అంటున్నమిస్త్రీ | Cyrus Mistry takes Tata Group to court, moves Company Law Tribunal claiming oppression | Sakshi
Sakshi News home page

సమరానికి సై అంటున్నమిస్త్రీ

Dec 20 2016 6:28 PM | Updated on Sep 4 2017 11:12 PM

సమరానికి సై అంటున్నమిస్త్రీ

సమరానికి సై అంటున్నమిస్త్రీ

టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నంత పనీ చేస్తున్నారు. టాటా గ్రూపు అరాచకాలపై పోరాడుతానని చెప్పిన మిస్త్రీ మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.

ముంబై:   టాటాసన్స్ మాజీ ఛైర్మన్  సైరస్ మిస్త్రీ అన్నంత పనీ చేస్తున్నారు.  టాటా గ్రూపు అరాచకాలపై పోరాడుతానని చెప్పిన మిస్త్రీ మంగళవారం నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.  కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద   టాటా సన్స్ అణచివేత మిస్ మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా ఈ పిటిషన్  దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై  మొదటి విచారణను   ఎస్ సీఎల్ టీ  డిసెంబర్  22న చేపట్టనుంది.

మరోవైపు   సైరస్ మిస్త్రీ  తాజా ఆరోపణలను టాటా గ్రూపు ఖండించింది.

కాగా  చట్టవిరుద్ధంతా తనను పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తున్న మిస్త్రీ  సోమవారం టాటా గ్రూపులోని అన్ని గ్రూపులకు రాజీనామా చేస్తూ ఒకప్రకటన విడుదల చేశారు. టాటా గ్రూపులోని ఆరు కంపెనీలకు రాజీనామా చేసిన ఆయన  రతన్ టాటాకు వ్యతిరేకంగా  చట్టానికి, సమానత్వానికి  గౌరవం దక్కే సంస్థ ద్వారా తనపోరాటం  కొనసాగుతుందని పేర్కొన్నారు.   తనపోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement