నా కనులు నీవిగా.. | cycling by blind man | Sakshi
Sakshi News home page

నా కనులు నీవిగా..

Sep 9 2013 1:59 AM | Updated on Apr 3 2019 4:04 PM

నా కనులు నీవిగా.. - Sakshi

నా కనులు నీవిగా..

ఇక్కడ సైకిల్‌ను తొక్కుతున్నది ఓ అంధుడు! నిజమే.. ఈ సైకిల్ పేరు అల్ట్రా బైక్. బ్రిటన్‌లోని హారోగేట్‌కు చెందిన సౌండ్ ఫోర్‌సైట్ టెక్నాలజీ సంస్థ దీన్ని తయారుచేసింది.


 ఇక్కడ సైకిల్‌ను తొక్కుతున్నది ఓ అంధుడు! నిజమే.. ఈ సైకిల్ పేరు అల్ట్రా బైక్. బ్రిటన్‌లోని హారోగేట్‌కు చెందిన సౌండ్ ఫోర్‌సైట్ టెక్నాలజీ సంస్థ దీన్ని తయారుచేసింది. ఈ సైకిల్ హ్యాండిల్ బార్ వద్ద రెండువైపులా కొన్ని బటన్లు ఉంటాయి. రహదారి మీద వెళ్లినప్పుడు ఏదైనా అడ్డంకి రావడం లేదా.. మనం డివైడర్ వైపునకు వెళ్లిపోవడం వంటివి జరి గితే.. ఇందులో ఉండే అల్ట్రాసోనిక్ సెన్సార్సు సదరు అడ్డంకులను గుర్తించి.. ఆయా బటన్లకు సందేశాన్ని పంపుతాయి. దీంతో అవి వైబ్రేట్ అవుతాయి.
 
  తద్వారా సైకిల్ తొక్కే అంధులకు సంకేతాన్ని అందిస్తాయి. దీనివల్ల వారు వాటిని ఢీకొట్టకుండా.. తమ మార్గాన్ని మార్చుకోవడానికి వీలవుతుంది. ఈ సైకిల్ అంధత్వం లేదా పాక్షిక అంధత్వంతో బాధపడేవారు మరింత స్వతంత్రంగా జీవించడాన్ని సాధ్యం చేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇటీవల ఈ బైక్‌ను స్కాట్లాండ్‌లో పరీక్షించి చూశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement