కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ఘోరం జరిగింది. విజయ్ ప్రతాప్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాను సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు.
కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ఘోరం జరిగింది. విజయ్ ప్రతాప్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాను సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. దాంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తన తుపాకితో కాల్పులు జరిపాడు. ఏఎస్ఐ గణేశన్, మరో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులు ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన విజయ్ ప్రతాప్ సింగ్ను వెంటనే అరెస్టు చేశారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు. అయితే అణు విద్యుత్ కేంద్రం లాంటి కీలకమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడంతో దేశ భద్రతపై కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావాల్సి వచ్చింది.