breaking news
kalpakkam
-
ఐజీసీఏఆర్, కల్పకంలో ఉద్యోగాలు
కల్పకం(తమిళనాడు)లోని భారత ప్రభు త్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(ఐజీసీఏఆర్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 337(డైరెక్ట్ రిక్రూట్మెంట్–98, స్టైపెండరీ ట్రెయినీ–239) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ► పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, సెక్యూరిటీ గార్డ్, వర్క్ అసిస్టెంట్ తదితరాలు. ► అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష/ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్(స్టెనోగ్రఫీ, ఫిజికల్ టెస్ట్, డ్రైవింగ్), అడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్టైపెండరీ ట్రెయినీ ►స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–1: 68(కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్) ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. స్టైపెండరీ ట్రెయినీ– కేటగిరీ–2: 171 ► ట్రేడులు: డ్రాఫ్ట్స్మెన్(మెకానికల్),ఫిట్టర్/రిగ్గర్, ప్లంబర్, వెల్డర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు. » అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి. ► ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.05.2021 ► వెబ్సైట్: www.igcar.gov.in టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు UPSC CAPF: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు -
సహచరులపై సీఆర్పీఎఫ్ జవాను కాల్పులు
-
సహచరులపై సీఆర్పీఎఫ్ జవాను కాల్పులు
కల్పకం అణు విద్యుత్ కేంద్రంలో ఘోరం జరిగింది. విజయ్ ప్రతాప్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాను సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. దాంతో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తన తుపాకితో కాల్పులు జరిపాడు. ఏఎస్ఐ గణేశన్, మరో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. క్షతగాత్రులు ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన విజయ్ ప్రతాప్ సింగ్ను వెంటనే అరెస్టు చేశారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని అధికారులు సమీక్షిస్తున్నారు. అయితే అణు విద్యుత్ కేంద్రం లాంటి కీలకమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడంతో దేశ భద్రతపై కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావాల్సి వచ్చింది.