అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్‌! | Congress leader sacked for referring to Rahul Gandhi as Pappu | Sakshi
Sakshi News home page

అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్‌!

Jun 14 2017 3:07 PM | Updated on Mar 18 2019 9:02 PM

అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్‌! - Sakshi

అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్‌!

చాలామంది ప్రజలు ఆయనను ‘పప్పు’ అని అంటున్నారంటూ..

మీరట్‌ (ఉత్తరప్రదేశ్‌) :  ‘దేశంలో చాలామంది ప్రజలు రాహుల్‌గాంధీని ‘పప్పు’ అని అంటున్నారు. కానీ పప్పు ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపలేదన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలి’  ఇది వాట్సాప్‌లో సాక్షాత్తు ఓ కాంగ్రెస్‌ నాయకుడు పెట్టిన కామెంట్‌. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అనడంతో ఆయనపై వేటుపడింది.

ఉత్తరప్రదేశ్‌ మీరట్‌ జిల్లా అధ్యక్షుడైన వినయ్‌ ప్రధాన్‌ రాహుల్‌ను ఉద్దేశించి ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌లో చేసిన వ్యాఖ్యలు స్థానికంగా వైరల్‌ అయ్యాయి. రాహుల్‌ను ‘పప్పు’ అని పేర్కొంటూ ఆయన మెసేజ్‌లు పెట్టడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు యూపీ పీసీసీ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ ప్రకటించారు. అయితే, తాను ఆ మెసేజ్‌లు పెట్టలేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రత్యర్థులు ఈ కుట్ర పన్నారని వినయ్‌ ప్రధాన్‌ అంటున్నారు. ఈ విషయంలో తన వివరణ కూడా తీసుకోకుండా వేటు వేయడం సరికాదని ఆయన వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement