మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి మూడేళ్లు జైలు | College student who raped schoolgirl gets 3 years in jail | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి మూడేళ్లు జైలు

Feb 12 2014 9:28 PM | Updated on Jul 28 2018 8:51 PM

మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ కాలేజీ విద్యార్థికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. థానే అడిషనల్ సెషన్స్ జడ్జి వీవీ విర్కార్ ఈ మేరకు తీర్పునిచ్చారు.

థానే: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ కాలేజీ విద్యార్థికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. థానే అడిషనల్ సెషన్స్ జడ్జి వీవీ విర్కార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

థానేలో యోగేష్ గోవింద్ సోలంకి అనే విద్యార్థి, మరో 14 ఏళ్ల విద్యార్థిని ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆ అమ్మాయితో సన్నిహితంగా మెలిగిన సోలంకి.. మూడేళ్ల క్రితం పెళ్లి పేరుతో ఆమెను  రాజ్కోట్ తీసుకెళ్లాడు. అనంతరం ఆ అమ్మయి బంధువులు సోలంకిపై మైనర్ బాలికను అపహరించడం, అత్యాచారం చేయడం వంటి నేరాలు కింద కేసు పెట్టారు. నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement