ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్రేప్ | Class 9 student kidnapped, gangraped by 3 men in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్రేప్

Sep 21 2015 9:11 AM | Updated on Sep 3 2017 9:44 AM

దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు.. ఆమెపై గ్యాంగ్రేప్ చేశారు.

దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు.. ఆమెపై గ్యాంగ్రేప్ చేశారు. ఆమె తన స్కూలుకు వెళ్తుండగా ఆ ముగ్గురు కిడ్నాప్ చేశారు. తనచేత బలవంతంగా మద్యం తాగించి పది గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారని ఆ బాలిక వాపోయింది. తర్వాత ఆమెను వాళ్లు ఆమె ఇంటిముందు పారేసి వెళ్లిపోయారు.

వాళ్లు ఈ అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి ఎంఎంఎస్ తయారుచేశారని, ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్లో కూడా పెడతామంటూ బెదిరించారని ఆమె తెలిపింది. అయితే దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే తనపై అత్యాచారం చేసినవాళ్లకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement