breaking news
class 9 student
-
తొమ్మిదో తరగతిలో మూడో భాష సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ కరిక్యులమ్‌లో భాగంగా తొమ్మిదో తరగతిలో కొత్తగా మూడో భాషను ప్రవేశపెట్టడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీని కారణంగా బోర్డు పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులపై అనవసర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులకు మూడో భాషను నేర్పించాలనుకుంటే ఐదు లేదా ఆరో తరగతి నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి మౌఖికంగా సూచించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను (జేఎన్వీ) ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఆరో తరగతిలోనే నేర్పించండి... విచారణ సందర్భంగా సీబీఎస్ఈ మూడో భాషా విధానంపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. మూడో భాషగా హిందీనే ఉండాలని విధానాల్లో ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. రాష్ట్ర భాష, ఇంగ్లిష్తో పాటు ఏదైనా మూడో భాషను నేర్పించవచ్చని పేర్కొన్నారు. ‘మీకు హిందీ ఇష్టం లేదు.. పోనీ సంస్కృతం అయితే ఇబ్బంది ఏమిటి?’అని తమిళనాడును ప్రశ్నించారు. మూడో భాష 9వ తరగతి నుంచి తప్పనిసరి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా.. జస్టిస్ నాగరత్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఇబ్బందికరం. 9వ తరగతి విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. కొత్త భాషను 9వ తరగతిలో ఎందుకు ప్రవేశపెడతారు? 6వ తరగతిలోనే ప్రారంభించండి’అని వ్యాఖ్యానించారు. టెన్త్ బోర్డు పరీక్షల ఒత్తిడి 8వ తరగతి చివరి నుంచే మొదలవుతుందని ఆమె గుర్తు చేశారు. తన బాల్యంలో హైసూ్కల్‌కు రాకముందే మూడో భాష నేర్చుకున్న అనుభవాలను ఈ సందర్భంగా ఆమె పంచుకున్నారు. కోర్టు అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేయాలని కేంద్రం తరఫున హాజరైన న్యాయవాదికి సూచించారు. రాష్ట్రంలో 38 మోడల్ స్కూళ్లు దేశవ్యాప్తంగా 666 జిల్లాల్లో 689 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసినట్లు కేంద్రం అఫిడవిట్లో తెలిపింది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే తమిళనాడులో ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు కాలేదని స్పష్టం చేసింది. జేఎన్వీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడంతో పాటు తాత్కాలిక వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని వివరించింది. అయితే, జేఎన్వీ నిబంధనలు తమ చట్టబద్ధమైన ద్విభాషా (తమిళం, ఇంగ్లిష్) విధానానికి విరుద్ధమని తమిళనాడు వాదించింది. జేఎన్వీల లక్ష్యాలను తమ సొంత విద్యా వ్యవస్థ ద్వారానే సాధిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున 38 మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం వివరించింది. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.50 కోట్లు వెచ్చించామని, వాటి నిర్వహణ కోసం ఏటా రూ.210 కోట్లు వెచ్చిస్తున్నామంది. 2024–25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలల నుంచి 1,340 మంది విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారంది. కొత్తగా జేఎన్వీలను ఏర్పాటు చేసే బదులు, తమ మోడల్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్ర విధానాలకు అనుగుణంగా జేఎన్వీ నిబంధనలను సవరించాలని సూచించింది. నిధుల విడుదల ప్రస్తావన సమగ్ర శిక్షా పథకం కింద నిధుల విడుదల అంశాన్ని సైతం తమిళనాడు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు గాను కేంద్రం వాటా కింద రూ.3,998.82 కోట్లు ఆమోదించగా, కేవలం రూ.450.60 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తెలిపింది. ఇంకా రూ.3,548.22 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, నిధుల జాప్యం వల్ల విద్యా కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రానివి అన్న కారణంతో అడ్డుకోవద్దు కేంద్ర ప్రభుత్వానివి అన్న ఒకే ఒక్క కారణంతో పథకాలను తిరస్కరించొద్దని తమిళనాడు ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న హితవు పలికారు. ‘మీకు సొంత విద్యా వ్యవస్థ ఉండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకోవద్దు. కేంద్రం ఏర్పాటు చేస్తోందన్న కారణంతో వ్యతిరేకించే ధోరణిని విడనాడాలి’అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే స్థానంలో టీవీకే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొత్త ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి విధానాన్ని అవలంభిస్తుందో చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు. నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్రం, రాష్ట్రం మధ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని ధర్మాసనం పేర్కొంది. సూచనలు తీసుకునేందుకు రాష్ట్రం ఆరు వారాల గడువు కోరడంతో తదుపరి విచారణను ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
9వ తరగతి పాఠ్యాంశంగా ‘ఎమర్జెన్సీ’
న్యూఢిల్లీ: దేశంలో 1975–77లో విధించిన అత్యవసర పరిస్థితిని 9వ తరగతి సామాజిక శాస్త్రం పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు ఎన్సీఈఆర్టీ గురువారం ప్రకటించింది. ఎమెర్జెన్సీ అంశంపై 2007లోనే అప్పటి యూపీఏ అప్పటి ప్రభుత్వం 12వ తరగతికి పాఠ్యాంశంగా తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితి అంశాన్ని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చడం ఇదే మొదటిసారి. కొత్తగా రూపొందించిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ’అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ లోని ఒక పేరాలో.. ’భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఒకటి.. 1975–77 మధ్యకాలంలో విధించిన అత్యవసర పరిస్థితి. 1970ల ప్రారంభంలో ఇందిరా గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దుష్పరిపాలన అంశాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. 1975 జూన్‌లో, అంతర్గత అలజడుల నెపంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ కాలంలో ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. పత్రికలపై ఆంక్షలు విధించారు. వందలాది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు అమలయ్యాయి..’అని అందులో ఉంది. దీనిపై కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద ప్రధాన్ స్పందించారు..‘ఎన్సీఈఆర్టీ చాలా మంచి పని చేసింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలను భవిష్యత్ తరాల వారు తప్పక తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా జాగ్రత్త పడతారు. ఆ సదుద్దేశంతోనే ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంగా తీసుకువచ్చింది’అని పేర్కొన్నారు. పాఠ్య పుస్తకానికి ‘కృష్ణ’ పేరు సబబే: ఎన్సీఈఆర్టీ ఆరో తరగతిలో కన్నడ భాష బోధనకు కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకానికి కృష్ణ అనే పేరు పెట్టడంపై తలెత్తిన వివాదాన్ని ఎన్సీఈఆర్టీ తీవ్రంగా ఖండించింది. కృష్ణ అంటే కర్ణాటకల్లో ప్రధాన నదుల్లో ఒకటని, ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. పాఠ్యపుస్తకాల ద్వారా కాషాయీకరణకు ఎన్సీఈఆర్టీ ప్రయతి్నస్తోందంటూ కర్ణాటకకు చెందిన విద్యా హక్కుల సంఘం ఆరోపించింది. కన్నడ సాంస్కృతిక గుర్తింపును, మాంసాహార ప్రాధాన్యాన్ని తక్కువచేస్తూ మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంది. దీనిపై ఎన్సీఈఆర్టీ బదులిస్తూ.. నూతన విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల పాఠ్యపుస్తకాలన్నిటికీ దేశీయ నదుల పేర్లే పెట్టామంది. హిందీ పాఠ్యపుస్తకానికి గంగ అనీ, ఇంగ్లిష్ పుస్తకానికి కావేరి అనీ, అదేవిధంగా ఉర్దూ పాఠ్యపుస్తకానికి యమున అని పెట్టామంది. -
సీఎం జగన్ విద్యార్థులుకు మరో శుభవార్త
-
ఢిల్లీలో బాలిక కిడ్నాప్.. గ్యాంగ్‌రేప్
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు దుండగులు.. ఆమెపై గ్యాంగ్‌రేప్ చేశారు. ఆమె తన స్కూలుకు వెళ్తుండగా ఆ ముగ్గురు కిడ్నాప్ చేశారు. తనచేత బలవంతంగా మద్యం తాగించి పది గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారని ఆ బాలిక వాపోయింది. తర్వాత ఆమెను వాళ్లు ఆమె ఇంటిముందు పారేసి వెళ్లిపోయారు. వాళ్లు ఈ అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి ఎంఎంఎస్ తయారుచేశారని, ఫిర్యాదు చేస్తే ఫేస్బుక్లో కూడా పెడతామంటూ బెదిరించారని ఆమె తెలిపింది. అయితే దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే తనపై అత్యాచారం చేసినవాళ్లకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయేమోనని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.


