ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా! | Chinese pet dog is a smoking addict! | Sakshi
Sakshi News home page

ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా!

Jul 1 2014 3:45 PM | Updated on Sep 29 2018 4:26 PM

ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా! - Sakshi

ఆ కుక్కపిల్లకు సిగరెట్ తాగడం భలే సరదా!

పొగ తాగకుంటే వచ్చే జన్మలో గాడిదగా పుడుతానని భయపడిందో ఏమో.. చైనాలోని ఓ పెంపుడు కుక్కకు పొగ తాగడం ఓ వ్యసనంగా మారింది.

బీజింగ్: పొగ తాగకుంటే వచ్చే జన్మలో గాడిదగా పుడుతానని భయపడిందో ఏమో.. చైనాలోని ఓ పెంపుడు కుక్కకు పొగ తాగడం ఓ వ్యసనంగా మారింది. చైనాలో రెండేళ్ల వయస్సులో ఉన్న ఓ కుక్క తన యజమాని నుంచి పొగతాగడం అలవాటు చేసుకుంది. ధూమపానానికి బానిసైన ఆ కుక్క పిల్ల నిద్రకు ఉపక్రమించే ముందు ఎంచక్కా ఓ దమ్ము కొట్టి సేదతీరుతుందట. 
 
గత సంవత్సర కాలంగా తన పెంపుడు కుక్క మీయా దమ్ము కొడుతోందని యజమాని వెల్లడించారు. ఐతే తన పెంపుడు కుక్క ఏ బ్రాండ్ పడితే అది తాగదని.. కేవలం యూక్సీ బ్రాండ్ సిగరెట్లను మాత్రమే తాగుతుందన్నారు. తన పెంపుడు కుక్క ఆరోగ్యంపై బెంగ పెట్టుకున్న యజమాని త్వరలోనే మీయా పొగమానేలా చేస్తానని  యజమాని లూ అంటున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement