చైనాకు వచ్చిపోయే విదేశీయుల వేలిముద్రలను ఆ దేశం భద్రపరచనుంది.
బీజింగ్: చైనాకు వచ్చిపోయే విదేశీయుల వేలిముద్రలను ఆ దేశం భద్రపరచనుంది. తమ దేశ భద్రత కోసం ఈ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించినట్లు చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ గురువారం తెలిసింది.
శుక్రవారం నుంచి షెంజెన్ విమానాశ్రయంలో వేలి ముద్రలను నమోదు చేస్తారు. రానున్న కాలంలో అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు ప్రదేశాల్లో దీనిని అమలు చేస్తారు.