ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్ | chandra babu naidu conducts tele conference with 6 thousand people at a time | Sakshi
Sakshi News home page

ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్

Oct 1 2015 12:07 PM | Updated on Jul 28 2018 6:48 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో ఒకేసారి 6 వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ఈ కాన్ఫరెన్సు పెట్టారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్వహణకు ప్రత్యేకంగా ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

సాంకేతికత, నిరంతర శ్రమ, వినూత్న ఆలోచనతో మన గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా మార్చుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడాలని ఆయన అన్నారు. మనతోపాటు సమాజం ఎదిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement