ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది.
ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా పోలీసులు ఈ కేసు పెట్టారు. గుప్తకాశీలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యాపారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈనెల 20వ తేదీన ఆ వ్యాపారి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎమ్మెల్యే సహా మొత్తం పదిమంది వ్యక్తులు అతడి నుంచి భారీ మొత్తాలు తీసుకున్నారని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి చెల్లించలేదని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుల్లో కూరుకుపోయిన తనకు ఆత్మహత్య తప్ప వేరే శరణ్యం లేదని చెప్పి ఓ లేఖ రాసిన సదరు వ్యాపారి.. ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారి నుంచి ఎమ్మెల్యే రూ. 42 లక్షలను అప్పుగా తీసుకున్నాడని అతడి భార్య తెలిపారు.