బడా వ్యాపారి కుటుంబం ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

బడా వ్యాపారి కుటుంబం ఆత్మహత్య

Published Thu, Feb 16 2017 2:45 PM

Businessman commits suicide along with wife and baby daughter

గయ: బిహార్‌ లోని గయ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  ధామి తోలా ప్రాంతానికి చెందిన  బడా వ్యాపారవేత్త కుటుంబం  అనుమానాస్పదంగా మరణించారు. గయా పట్టణంలో పప్పుధాన్యాల  విక్రయించే అతిపెద్ద వ్యాపారి అయిన రవి గుప్తా భార్య,  ఓ చిన్నారి  సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి కారణంగానే  ఆత్మహత్య చేసుకున్నట్లుగా  పోలీసులు భావిస్తున్నారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ సింగ్  అందించిన సమాచారం ప్రకారం   రవి గుప్తా అలియాస్ విక్కీ  (36)  పట్టణంలో  పేరొందిన పెద్ద వ్యాపారవేత్తలో ఒకరిగా ఉన్నారు. ఏమైందో, ఏమో తెలియదు గానీ , అతని భార్య నిసి దేవి (30), వారి మూడు ఏళ్ల పాప  వారి నివాసంలో అనూహ్యంగా మరణించారు. గురువారం ఉదయం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.  ప్రాథమిక అంచనాల ప్రకారం బుధవారం  రాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు.  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

అయితే  ఇటీవల ఫిబ్రవరి 13 న రవి గుప్తా తల్లి గీతా దేవి కూడా  ఆత్మహత్య  చేసుకున్నారు. దీంతో అతని సోదరి నిషా గుప్తా రవిదంపతులపై కేసు నమోదు చేశారు. వారి  వేధింపుల కారణంగానే తన తల్లి ఆత్మహత్యకు కారణమని నిషా ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన ఈ జంట  ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement