చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఛత్తీస్‌ఘఢ్: చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్న మావోయిస్టులు సోమవారం బిఎస్ఎఫ్ క్యాంప్ పై దాడి చేశారు. ఈ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్టు ఎస్పీ జితేందర్ సింగ్ మీనా తెలిపారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించామని, మావోయిస్టులు సంఘటనా స్థలం నుంచి త ప్పించుకున్నారన్నారు. కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా నక్సల్స్ దాడికి తెగబడ్డారని ఎస్పీ జితేందర్ సింగ్ మీనా వెల్లడించారు.
కాగా శనివారం ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు ఆదివారం 17 వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.