చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట! | Bombay High Court quashes NBW against Preity Zinta in cheque bounce case | Sakshi
Sakshi News home page

చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!

Jan 30 2014 7:05 PM | Updated on Sep 2 2017 3:11 AM

చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!

చెక్ బౌన్స్ కేసులో ప్రీతి జింటాకు ఊరట!

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హై కోర్టులో ఊరట లభించింది.

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు బాంబే హై కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో స్టేట్ మెంట్ రికార్డు కోసం హజరవ్వడంలో విఫలమైన ప్రీతి జింటాకు అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జనవరి 27 తేదిన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను గురువారం కొట్టివేసింది.
 
సినీ రచయిత అబ్బాస్ టైర్ వాలా దాఖలు చేసిన కేసులో పలు దఫాలు కోర్టుకు గైర్హాజరవ్వడంతో వారెంట్లు జారీ చేశారు. వారెంట్ల జారీని సవాల్ చేస్తూ జింటా హైకోర్టును ఆశ్రయించారు. 
 
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చెక్ బౌన్స్ కేసులో న్యాయవాది ద్వారా తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవచ్చనే ఉదహరిస్తూ హైకోర్టులో జింటా పిటిషన్ దాఖలు చేశారు. అయితే జింటా పిటిషన్ నిరాకరించి ఫిబ్రవరి 10 తేదిన నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీచేశారు. జింటా కేసును మూడు నాలుగు వారాలు వాయిదా వేయడమే కాకుండా.. కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement