బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు దేశంలో ఏ కోర్టూ చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
బోఫోర్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు దేశంలో ఏ కోర్టూ చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. దీనిపై మీడియానే విచారణ చేసింది తప్ప.. ఒక్క కోర్టులోనూ స్కాంగా నిరూపితం కాలేదని స్వీడన్ పత్రిక ‘డాగెన్స్ నిహెట్టర్’కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బోఫోర్స్ తుపాకుల కొనుగోలుపై మీడియానే విచారణ చేపట్టిందా అని అడగ్గా.. ‘అది స్కాం అని ఇప్పటిదాకా కోర్టులేవీ చెప్పలేదు. బోఫోర్స్ తెరపైకి వచ్చాక చాలా ఏళ్లపాటు నేనే రక్షణశాఖ మంత్రిగా ఉన్నా.
సైనిక జనరల్స్ అందరూ ఆ తుపాకులు అత్యుత్తమమైనవని చెప్పారు. వాటిని నేటికీ భారత సైన్యం వినియోగిస్తోంది’ అని ఆయన వివరించారు. కాగా, బోఫోర్స్ తుపాకులు నాణ్యమైనవే అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు.