క్రిమినల్ కేసులో దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎమ్పీలను అనర్హులుగా ప్రకటించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల్ని తిరస్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని బీజేపీ విమర్శించింది.
క్రిమినల్ కేసులో దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎమ్పీలను అనర్హులుగా ప్రకటించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల్ని తిరస్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని బీజేపీ విమర్శించింది. దీన్ని తాము వ్యతిరేకిస్తామని బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా పార్లమెంట్లో ఇంకా ఆమోదం పొందాల్సివుంది.
'దోషులుగా తేలిన ఎమ్పీలను రక్షించేందుకు కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ రూపొందించింది. దీన్ని మేం వ్యతిరేకిస్తాం. ఆర్డినెన్స్పై సంతకం చేయవద్దని రాష్ట్రపతికి కూడా విన్నవిస్తాం' అని సుష్మా ట్వీట్ చేశారు. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్ర మనీశ్ తివారీ స్పందిస్తూ.. రాజ్యాంగ పరమైన లేదా న్యాయపరమైన అంశాలు రాజ్యాంగం ప్రకారం నిర్ణయిస్తారని, బీజేపీ పరిధిలో కాదని చెప్పారు.