చైనా కన్నా భారత్ బెటర్ | Better than China and India | Sakshi
Sakshi News home page

చైనా కన్నా భారత్ బెటర్

Oct 7 2015 12:16 AM | Updated on Sep 3 2017 10:32 AM

చైనా కన్నా భారత్ బెటర్

చైనా కన్నా భారత్ బెటర్

వృద్ధి వేగంలో చైనాకన్నా భారత్ పరిస్థితి బాగుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది.

వృద్ధి వేగంపై ఐఎంఎఫ్ నివేదిక
2015లో 7.3 శాతం వృద్ధి అంచనా...
{Mితం అంచనాలకు కోత
{పపంచ వృద్ధి అంచనాలూ కట్

 
వాషింగ్టన్: వృద్ధి వేగంలో చైనాకన్నా భారత్ పరిస్థితి బాగుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అంచనాలు తగ్గుతున్నట్లు కూడా తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే...
    
2015లో భారత్ వృద్ధి అంచనా 7.3 శాతం. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకన్నా ఇది తక్కువ.  కాగా 2016లో భారత్ వృద్ధి రేటు అంచనా 7.5 శాతం. అయితే చైనా విషయంలో ఈ స్పీడ్ 6.3 శాతంగా ఉండనుంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినా భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. 2020 కల్లా 7.7 శాతం వృద్ధి సాధనతో భారత్ చక్కటి పనితీరు ప్రదర్శించనుంది.
     
ఇటీవలి పాలసీ సంస్కరణలు, పెట్టుబడుల పెరుగుదల, కనిష్ట స్థాయిల్లో కమోడిటీ ధరల వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్నాయి.  భారత్‌లో ద్రవ్యోల్బణం 2015లో దిగువస్థాయిల్లోనే కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్, తదితర వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుదల దీనికి కారణం.    చైనా ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా  6.8 శాతం.
 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్పీడ్ డౌన్...

 కాగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు విషయంలో అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. 2015లో ఈ రేటు 3.1 శాతం ఉంటుందని పేర్కొంది. 2014లో సాధించిన వృద్ధి (3.4 శాతం) కన్నా ఇది 0.3 శాతం తక్కువ. 2015 జూలైలో (ఐఎంఎఫ్) అంచనా వేసిన  (3.3 శాతం) రేటుకన్నా 0.2 శాతం తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో రికవరీ నెమ్మదిగా ఉండడం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, క్రూడ్ ధరల తగ్గుదలతో చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. కాగా 2016లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3.6 శాతంగా అంచనా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement