breaking news
The International Monetary Fund
-
చైనా కన్నా భారత్ బెటర్
వృద్ధి వేగంపై ఐఎంఎఫ్ నివేదిక 2015లో 7.3 శాతం వృద్ధి అంచనా... {Mితం అంచనాలకు కోత {పపంచ వృద్ధి అంచనాలూ కట్ వాషింగ్టన్: వృద్ధి వేగంలో చైనాకన్నా భారత్ పరిస్థితి బాగుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి సంబంధించి విడుదల చేసిన ఒక నివేదికలో ఐఎంఎఫ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి అంచనాలు తగ్గుతున్నట్లు కూడా తాజా నివేదికలో పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... 2015లో భారత్ వృద్ధి అంచనా 7.3 శాతం. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకన్నా ఇది తక్కువ. కాగా 2016లో భారత్ వృద్ధి రేటు అంచనా 7.5 శాతం. అయితే చైనా విషయంలో ఈ స్పీడ్ 6.3 శాతంగా ఉండనుంది. ఇతర వర్ధమాన దేశాలతో పోల్చినా భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. 2020 కల్లా 7.7 శాతం వృద్ధి సాధనతో భారత్ చక్కటి పనితీరు ప్రదర్శించనుంది. ఇటీవలి పాలసీ సంస్కరణలు, పెట్టుబడుల పెరుగుదల, కనిష్ట స్థాయిల్లో కమోడిటీ ధరల వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్నాయి. భారత్లో ద్రవ్యోల్బణం 2015లో దిగువస్థాయిల్లోనే కొనసాగుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్, తదితర వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుదల దీనికి కారణం. చైనా ఈ ఏడాది వృద్ధి రేటు అంచనా 6.8 శాతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్పీడ్ డౌన్... కాగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు విషయంలో అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. 2015లో ఈ రేటు 3.1 శాతం ఉంటుందని పేర్కొంది. 2014లో సాధించిన వృద్ధి (3.4 శాతం) కన్నా ఇది 0.3 శాతం తక్కువ. 2015 జూలైలో (ఐఎంఎఫ్) అంచనా వేసిన (3.3 శాతం) రేటుకన్నా 0.2 శాతం తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో రికవరీ నెమ్మదిగా ఉండడం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, క్రూడ్ ధరల తగ్గుదలతో చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కోతకు కారణమని పేర్కొంది. కాగా 2016లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3.6 శాతంగా అంచనా వేసింది. -
వృద్ధి 5 శాతం పైనే: చిదంబరం
వాషింగ్టన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 3.75 శాతం మాత్రమే ఉండొచ్చన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాలను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తోసిపుచ్చారు. ఇవి పూర్తిగా నిరాశాపూరితమైనవి, వృద్ధి 5 శాతం పైగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వర్షపాతం బాగుండటం వల్ల వ్యవసాయోత్పత్తి మెరుగ్గా ఉండటంతో పాటు ఏడాదిగా తీసుకుంటున్న సంస్కరణలు కూడా ఇందుకు దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభావాలన్నీ ద్వితీయార్థంలో కనిపించగలవన్నారు. అమెరికాకు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సంస్క రణలపై మాట్లాడుతూ, దేశానికి ఒక విధానం ఉంటుందని, సిసలైన ఇన్వెస్టర్లు దానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం ఏమీ లేదు: రాజన్ కాగా భారత్ లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులేమీ లేవని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వాషిం గ్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినస్థాయి లో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, నిధుల కోసం మరో ఐదేళ్ల పాటు అసలు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండబోదని చెప్పారు. ఒకవేళ మరీ కష్టతరమైన పరిస్థితులు ఎదురైతే.. బంగారం రూపంలోనైనా అప్పులు తీర్చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.