మిస్టరీగానే ఆయేషా హత్య

ఆయేషా మీరా(ఫైల్‌) - Sakshi


- సత్యం బాబు నిర్దోషి అన్న హైకోర్టు

- అసలు దోషులెవరో తేలని వైనం


సాక్షి, గుంటూరు: 
ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో అసలు హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే అంశం మిస్టరీగానే మిగిలింది. తెనాలికి చెందిన ఆయేషా మీరా నిమ్రా కాలేజీలో 2007లో బీఫార్మసీలో చేరింది. కళాశాల యాజమాన్యం సూచనతో సమీపంలోని దుర్గా లేడీస్‌ హాస్టల్‌లో చేరింది. క్రిస్మస్‌ సెలవులకు ఇంటికి వచ్చి డిసెంబర్‌ 26వ తేదీ రాత్రి తిరిగి హాస్టల్‌కు వెళ్లిన ఆయేషా.. దారుణ స్థితిలో శవమై తేలింది.ఈ హత్య కేసులో తొలుత హాస్టల్‌లో వంట చేసే మనిషిని అనుమానించి విచారించారు. ఆ తరువాత లడ్డు అనే మరో వ్యక్తిని, అతని స్నేహితుడు కరీంనగర్‌కు చెంది న వ్యక్తిని విచారించారు. ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కేసులో చేర్చడానికి యత్నించి చివరకు సత్యంబాబును నిందితుడిగా చేర్చారు. అప్పట్లో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్‌ ఆనంద్‌ కేసును పర్యవేక్షించారు. 12 గంటల్లోనే దోషుల పేర్లు వెల్లడిస్తానని ఆయన చెప్పినా వివిధ కారణాలతో ప్రకటించలేదు. ఆయన సీపీగా ఉన్నంత వరకు కేసు విచారణ వేగంగా జరిగింది.అయితే, ఆనంద్‌ బదిలీతో కేసు మొత్తం తారు మారైంది. సత్యంబాబు సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో 2008 సంవత్సరం ఆగస్టు 17న అరెస్టు అయ్యాడు. అసలు దోషుల్ని కాపాడాలనే యోచనతో పోలీ సులే సత్యంబా బును ఇరికించారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లు వెత్తాయి. హత్య జరిగిన రోజు హాస్టల్‌ సత్యంబాబు హాస్టల్‌ వెనుక భాగం నుంచి గోడదూకి లోపలికి వచ్చా డని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. కానీ పోలీసు జాగి లాలు ఆ వైపు వెళ్ళకుండా, ప్రధాన మార్గౖ మెన మెట్లపై నుంచి వెళ్లాయి. సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో.. అసలు దోషులెవరో తేల్చేందుకు కేసును పునర్విచా రించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.అసలు దోషుల్ని శిక్షిస్తేనే ఆయేషా ఆత్మకు శాంతి

- ఆయేషా మీరా తల్లిదండ్రుల డిమాండ్‌


తెనాలి: సత్యంబాబు నిర్దోషి అని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని, పోలీసులు వినలేదని  ఆయేషా మీరా తల్లిదండ్రులు షంషా ద్‌ బేగం, ఇక్బాల్‌ బాషాలు చెప్పారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో వారు విలేకరులతో మాట్లాడారు. హాస్టల్‌ వార్డెన్‌ కోనేరు పద్మ నోరు తెరిస్తే 5 నిమిషాల్లో కేసు పరిష్కారం అవుతుందని షంషాద్‌ బేగం అన్నారు. వార్డెన్‌ పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్‌ విద్యార్థులు కవిత, సౌమ్య, ప్రీతి, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్‌కుమార్‌ నిందితులనేది తమ వాదనగా చెప్పారు. వారి రాసలీలలు తమ పాప చూసిందనే ఆమెను చంపేశారని ఆరోపించారు. ఇప్పటికైనా అసలు దోషుల్ని çపట్టుకొని శిక్షిస్తేనే తమ పాప ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేసును తిరిగి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top