మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం | Arvind Kejriwal donates Rs 50,000 to Irom Sharmilas party | Sakshi
Sakshi News home page

మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం

Feb 19 2017 11:44 AM | Updated on Aug 14 2018 9:04 PM

మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం - Sakshi

మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీకి విరాళం ఇచ్చారు.

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌..  మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీకి విరాళం ఇచ్చారు. కేజ్రీవాల్‌ 50 వేల రూపాయలను షర్మిలకు విరాళం పంపారు. అంతేగాక ఆమెకు సాయం చేయాల్సిందిగా ప్రజలను కోరారు.

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె పార్టీ పీఆర్‌జేఏ ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలను విరాళంగా సేకరించింది. థౌబల్‌ స్థానం నుంచి ఆమె నామినేషన్  దాఖలుచేశారు. నామినేషన్  వేసేందుకు ఇంఫాల్‌ నుంచి 20 కి.మీ. సైకిల్‌ తొక్కి షర్మిల థౌబల్‌ చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement