జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ | Army chief in Japan, discusses defence cooperation | Sakshi
Sakshi News home page

జపాన్ ఆర్మీ చీఫ్ తో భారత ఆర్మీ చీఫ్ భేటీ

Nov 17 2015 7:22 PM | Updated on Sep 3 2017 12:37 PM

జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు.

టోక్యో: జపాన్ ప్రధాన సైనికాధికారిని ఇతర అధికారులను భారత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణకు సంబంధించిన ఆందోళనలపై పరస్పరం చర్చించుకున్నారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన సహకారం ఎప్పటికీ కొనసాగేదిశగా వారి మధ్య చర్చలు జరిగినట్లు భారత ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

నవంబర్ 16 నుంచి 19 వరకు దల్బీర్ సింగ్ జపాన్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో 'జనరల్ సింగ్ నారాసినో, సిమోసిజు, జపాన్ ఎయిర్ డిఫెన్స్ స్కూల్, ఫుజి క్యాంపు, జపాన్ మిడిల్ ఆర్మీకి చెందిన హెడ్ క్వార్టర్స్ లో పర్యటిస్తారు' అని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement