డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు | Amid Dollar Shock, Rupee Sinks Further; Seen Hitting 70 Now; Sensex Struggles | Sakshi
Sakshi News home page

డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు

Nov 21 2016 10:00 AM | Updated on Sep 4 2017 8:43 PM

డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు

డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు

అంతర్జాతీయ సంకేతాలు, రూపాయ బలహీన నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్ 141 పాయింట్లు క్షీణించి26,009వద్ద , నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 8,025 వద్ద ట్రేడవుతున్నాయి.

ముంబై:దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి  నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలో స్వల్పనష్టాల్లో అమ్మకాల ఒత్తడితో మరింత దిగజారాయి. అంతర్జాతీయ సంకేతాలు, రూపాయ బలహీనంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ కీలకమైన మరో మద్దతుస్తాయి 8 వేల దిగువకు చేరింది. 94 పాయింట్ల నష్టంతో 7980  వద్ద బలహీనంగా  ట్రేడవుతోంది. గత జూన్ తర్వాత  ఈ స్థాయిని నమోదు చేసింది. ఎఫ్‌ఐఐల నిరవధిక అమ్మకాలు,  రూపాయ పతనం దేశీయంగా సెంటిమెంటును దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా  ఈ మాసంలో సుమారు రూ.9 వేలకోట్ల అమ్మకాలకు పాల్పడ్డారు.   మెటల్‌, ఐటీ  సానుకూలంగా,  రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాలు  ప్రతికూలంగా నూ కొనసాగుతున్నాయి.  ఇండస్‌ఇండ్, ఐషర్‌, అంబుజా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, ఐటీసీ  నష్టాల్లోనూ,  హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌  లాభాల్లోనూ  ట్రేడవుతున్నాయి.అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది.

అటు  రూపాయి మరింత పతనం దిశగా సాగుతోంది. 29పైసల నష్టంతో 68.12 దిగువన ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో  పది గ్రా. పుత్తడి 161  రూపాయల నష్టంతో రూ. 28,970 వద్ద ఉంది.

Advertisement

పోల్

Advertisement