breaking news
Amid Dollar Shock
-
డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు
-
రూపాయి 70 స్థాయికి దిగజారుతుందా?
ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం మరింత బలహీనపడుతోంది. ఫెడ్ వడ్డీరేట్లు పెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో డాలర్ ఒకవైపు దూసుకుపోతుండగా రూపాయి మరింత దిగజారుతోంది. డాలర్ మారకపు విలువలో 68 రూపాయల నుంచి దిగజారి మరింత పతనం దిశగా పయనిస్తోంది. ఆరంభంలోనే శుక్రవారం నాటి 68.13 తో పోలిస్తే. 68.16 స్థాయికి పడిపోయింది. గతవారం రూపాయి 31 పైసలు క్షీణించి, 9 నెలల కనిష్ట 68.13 వద్ద స్థాయి వద్ద ముగిసింది. రూపాయి బలహీనత రాబోయే కాలంలో విశ్లేషకులు కొనసాగనుందనివిశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో 2013 నాటి 68. 85 స్థాయికి చేరుతందని హెచ్ ఆర్ బీవీ క్లయింట్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు టీఎస్ హరిహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో డాలర్ తో పోలిస్తే రూ. 70 మార్క్ కు పడిపోనుందని చెప్పారు. ట్రంప్ విజయం, డాలర్ 14 సంవత్సరాల గరిష్టాన్ని నమోదు చేయడంద దీనికి కారణమన్నారు. మరోవైపు అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లునష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రధాన ఆరు ప్రపంచ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ పెరుగుదల, దేశీయ సూచీల్లో ఫారిన్ పెట్టుబడిదారుల అమ్మకాల కారణంగా రూపాయ పతనం కొనసాగుతోందని విశ్లేషకులు అంచనావేశారు. భారత ఈక్విటీ మార్కెట్ లో విదేశీ మదుపరులు ఇప్పటివరకు రూ. 9,000 కోట్ల విలువకు పైగా విక్రయించడం, అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తోందన్నారు. మరోవైపు గత వారం విడుదలచేసిన అమెరికా వినియోగదారుల ధరల అక్టోబర్ డేటా గత ఆరునెలల స్తాయిని దాటి, తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జానెట్ డిసెంబర్ లో వడ్డీ రేట్లు పెరగనున్నాయనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
డాలర్ షాక్.. నష్టాల్లో మార్కెట్లు
ముంబై:దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభంలో స్వల్పనష్టాల్లో అమ్మకాల ఒత్తడితో మరింత దిగజారాయి. అంతర్జాతీయ సంకేతాలు, రూపాయ బలహీనంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ కీలకమైన మరో మద్దతుస్తాయి 8 వేల దిగువకు చేరింది. 94 పాయింట్ల నష్టంతో 7980 వద్ద బలహీనంగా ట్రేడవుతోంది. గత జూన్ తర్వాత ఈ స్థాయిని నమోదు చేసింది. ఎఫ్ఐఐల నిరవధిక అమ్మకాలు, రూపాయ పతనం దేశీయంగా సెంటిమెంటును దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఈ మాసంలో సుమారు రూ.9 వేలకోట్ల అమ్మకాలకు పాల్పడ్డారు. మెటల్, ఐటీ సానుకూలంగా, రియల్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాలు ప్రతికూలంగా నూ కొనసాగుతున్నాయి. ఇండస్ఇండ్, ఐషర్, అంబుజా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, మారుతీ, ఐటీసీ నష్టాల్లోనూ, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్, విప్రో, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టాటా స్టీల్ లాభాల్లోనూ ట్రేడవుతున్నాయి.అలాగే పెద్ద నోట్ల రద్దు నిషేధం కూడా దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. అటు రూపాయి మరింత పతనం దిశగా సాగుతోంది. 29పైసల నష్టంతో 68.12 దిగువన ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 161 రూపాయల నష్టంతో రూ. 28,970 వద్ద ఉంది.