క్రెడిట్ కార్డు మోసాలు: అమెరికన్ ఎక్స్ప్రెస్కు భారీ జరిమానా | American Express fined for illegal credit card practices | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డు మోసాలు: అమెరికన్ ఎక్స్ప్రెస్కు భారీ జరిమానా

Dec 25 2013 10:23 AM | Updated on Aug 24 2018 8:18 PM

అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. క్రెడిట్ కార్డు అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలు మరో మూడింటికి భారీ జరిమానా పడింది.

అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే, క్రెడిట్ కార్డు అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు ఆ సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలు మరో మూడింటికి భారీ జరిమానా పడింది. దాదాపు 3.35 లక్షల మంది వినియోగదారులకు రూ. 368 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నియంత్రణ సంస్థలు ఆదేశించాయి. వంద కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించాలన్నాయి.

అమెరికన్ ఎక్స్ప్రెస్, దాని అనుబంధ సంస్థలు అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సంబంధిత కంపెనీ, సెంచూరియన్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్.. ఈ మూడు సంస్థలకూ జరిమానా పడింది.  బిల్లింగు విషయంలో అక్రమాలకు పాల్పడిందని, మోసకారి మార్కెటింగ్ వ్యవహారాలు చేశారని, క్రెడిట్ కార్డుల యాడ్ ఆన్ ఉత్పత్తుల విషయంలో ఇలా చేశారని వీటిపై ఆరోపణలొచ్చాయి. ఇన్నాళ్లుగా అమెరికన్ ఎక్స్ప్రెస్ చేతిలో మోసపోయిన లక్షలాది మంది వినియోగదారులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నామని కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో (సీఎఫ్పీబీ) డైరెక్టర్ రిచర్డా కార్డ్రే తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement